వేపచెట్టుకు దిష్టిబొమ్మలా యువకుడి మృతదేహం! హత్యా, ఆత్మహత్యా..?

by Bhoopathi Nagaiah |

ఆదోని కొత్త బైపాస్ ప్రాంతంలో వేపచెట్టుకు దిష్టిబొమ్మలా వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

వేపచెట్టుకు దిష్టిబొమ్మలా యువకుడి మృతదేహం! హత్యా, ఆత్మహత్యా..?
X

దిశ ప్రతినిధి, ఆదోని : ఆదోని పట్టణ శివారులో వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. కొత్త బైపాస్ ప్రాంతంలో వేపచెట్టుకు దిష్టిబొమ్మలా వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోని వివరాలు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదోని పట్టణంలోని బండిమెట్ట కాలనీకి చెందిన వెంకటేష్ (30) కొత్త బైపాస్ ప్రాంతంలో వేపచెట్టుకు ఉరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు రోడ్డు పక్కన చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి ఆదోని-2 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన సీఐ రాజశేఖర్ రెడ్డి వెంటనే తన సిబ్బందిని ఘటన స్థలానికి పంపించి వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నట్లు సమాచారం.కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Next Story