మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 04:50:08  IST  )

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌ రావు (Jaganmohan Rao)కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌ రావు (Jaganmohan Rao)కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఇవాళ ఆయనపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. ప్రస్తుత నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Thangiraala Sowmya)పై అవమానకరంగా, వ్యక్తిగత విమర్శలు చేశారంటూ టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జగన్‌మోహన్ రావు మాట్లాడిన వీడియోలను సైతం సాక్ష్యాలతో సహా వారికి అందజేశారు.

కాగా, తంగిరాల సౌమ్య 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావుపై 27,395 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మొండితోక జగన్‌మోహన్‌రావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచి.. 2024లో సౌమ్య చేతిలో పరాజయం పాలయ్యారు.

Read More..

నేడు విజయవాడలో జగన్ పర్యటన.. కారణం ఇదే

Next Story