- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు విజయవాడలో జగన్ పర్యటన.. కారణం ఇదే
గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లి అక్కడి బాధితులతో జగన్ మాట్లాడబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన ఖరారు అయింది. ఇవాళ విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ విజయవాడ జోబి నగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను జగన్ పరామర్శిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లి అక్కడి బాధితులతో జగన్ మాట్లాడబోతున్నారు. వాళ్ళ సమస్యలను తెలుసుకోనున్నారు. వాళ్లంతా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఇళ్ళను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో ? వివరించినట్లు వైసీపీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నేరుగా సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నట్లు స్పష్టం చేసింది. అయితే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారని సమాచారం.






