మేనమామే కడతేర్చాడు

by Dishafeatures2 |
మేనమామే కడతేర్చాడు
X

దిశ, అనకాపల్లి జిల్లా: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మేనల్లుడిని తన చేతులతోనే పెంచిన మేనమామ.. చివరకు ఆ మేనల్లుడిని ఆయనే హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లా మన ఉపపాక మండలం గణపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. లోవరాజు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మేనమామ గాలి శ్రీను పెంచి పెద్ద చేశాడు. చిన్నతనం నుండి లావరాజు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. వృత్తిరీత్యా శ్రీను చికెన్ కొట్టు నిర్వహిస్తూ ఉండేవాడు. అతనికి సహాయంగా లావరాజు పనిచేస్తూ ఉండేవాడు. ఇటీవల కాలంలో నర్సీపట్నం నుండి చూచుకొండ గ్రామానికి వచ్చి చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు. తరచూ షాపులో ఉన్న డబ్బులు తీసుకొని మద్యం సేవించడమే కాకుండా మేనమామ శ్రీనును లావరాజు వేధించేవాడు.

ఎంత చెప్పినప్పటికీ మాట వినకపోవడంతో లావరాజును పనిలో నుండి తీసేశాడు మేనమామ శ్రీను. అక్కడి నుండి వెళ్లిపోయిన లావరాజు పూడిమడకలో మరో చికెన్ షాప్ లో పనికి కుదిరాడు. అక్కడ మూడు రోజులు పని చేసిన తర్వాత తిరిగి మేనమామ దగ్గరకు వచ్చాడు. రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మధ్యలో వీరిద్దరి మధ్య మాట పెరగడంతో పక్కనే ఉన్న కత్తిని తీసుకొని లావరాజు తలనరికాడు. శవాన్ని మాయం చేద్దామని ఉద్దేశంతో మూటగట్టి తరలించే ప్రయత్నం చేయడంతో దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు.




Next Story

Most Viewed