- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలి మంటకు వృద్ధురాలు బలి..
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో చలిమంట అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది.

X
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో చలిమంట అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే బెల్లంపల్లి పట్టణం 24 డీపీ ఏరియాలో నివాసం ఉంటున్న దురిశెట్టి సారమ్మ (75) తాను పడుకునే మంచం పక్కనే చలిమంటను ఏర్పాటు చేసుకుంది.
అలాగే నిద్రలోకి చారుకున్న సదరు వృద్ధురాలు ప్రమాదవశాత్తు తెల్లవారుజామున చలిమంట నిప్పు అంటుకొని మృతి చెందింది. పక్కగదిలో పడుకున్న మనుమడు వృద్ధురాలు పడుకున్న గదిలోకి ఉదయం వెళ్లి చూడగా మంచంతో సహాకాలిపోయింది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్సై సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






