72 ఏళ్ల వృద్ధుడిపై ఒక్కసారిగా 40 మొసళ్లు ఎటాక్.. చివరకు ఏం జరిగిందంటే?

by Disha Web Desk 19 |
72 ఏళ్ల వృద్ధుడిపై ఒక్కసారిగా 40 మొసళ్లు ఎటాక్.. చివరకు ఏం జరిగిందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంబోడియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో పడిన ఓ 72 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అందులోని 40 మొసళ్లు అతడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కంబోడియాలోని సయొమ్ రీఫ్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం 40 మొసళ్లను పెంచుతోంది.

ఈ క్రమంలో వాటిని సంరక్షిస్తున్న ఓ వృద్ధుడు, తాజాగా ఓ మొసలి గుడ్లు పెట్టడంతో.. దానిని బోనులో నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. చేతిలో ఉన్న కర్రతో దానిని కదిలించాడు. ఈ క్రమంలో ఆ మొసలి కర్రను లోపలికి లాక్కుంది. దాంతో ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. దాదాపు 40 మొసళ్లు దాడి చేయడంతో ఆ వృద్ధుడి శరీరం ముక్కలుగా అయ్యిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed