- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగా నదిలో మునిగి ఐఐటీ విద్యార్థి మృతి
by Javid Pasha |
తోటి విద్యార్థులతో కలిసి గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఓ ఐఐటీ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.

X
దిశ, వెబ్ డెస్క్: తోటి విద్యార్థులతో కలిసి గంగా నదిలో స్నానానికి వెళ్లిన ఓ ఐఐటీ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని హరిద్వార్ లో జరిగింది. శ్యాంపూర్ ఎస్హెచ్వో వినోద్ తప్లియాల్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ కు చెందిన సిద్ధార్థ్ (21) రూర్కీ ఐఐటీలో చదువుతున్నాడు. ప్రాజెక్ట్ పని మీద సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్, ప్రొఫెసర్ తో కలిసి హరిద్వార్ వెళ్లాడు. స్థానికంగా ఉన్న దివ్య ప్రేమ్ సేవా మిషన్ ఆశ్రమంలో ఉంటున్న వారు.. ఆదివారం సెలవు కావడంతో హరిద్వార్ లోని గంగా నదిలోకి స్నానం కోసమని దిగారు. అయితే అలలు ఉధృతంగా రావడంతో సిద్ధార్థ్ కొట్టుకుపోయాడు. సిద్ధార్థ్ మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






