స్కూటీని ఢీ కొట్టిన ఆటో.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

by Ratna Kumari |   (  Updated:2026-03-14 11:52:48  IST  )

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా అతి వేగంతో ఆటోను నడపడం వల్ల స్కూటీ పై వెళ్తున్న ఇద్దరి ప్రాణాలు కానరాని లోకాలకు వెళ్లిపోయాయి.

స్కూటీని ఢీ కొట్టిన ఆటో.. ఇద్ద‌రు యువ‌కులు మృతి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా అతి వేగంతో ఆటోను నడపడం వల్ల స్కూటీ పై వెళ్తున్న ఇద్దరి ప్రాణాలు కానరాని లోకాలకు వెళ్లిపోయాయి. ఆర్మూర్ పట్టణం పిప్రి గ్రామ మధ్యలో గల పెట్రోల్ బంక్ సమీపంలో సంభవించిన ఈ రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోవడంతో పిప్రి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పిప్రి గ్రామం నుంచి స్కూటీ పై సంచు శ్రీనివాస్, విజయ్ అనే ఇద్దరు యువకులు ఆర్మూర్ వైపు వెళ్తుండ‌గా.. ఆర్మూర్ నుంచి పిప్రి వైపు వెళ్తున్న ఆటోను ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు.


దీంతో స్కూటీపై ఆర్మూర్ వెళ్తున్న ఇద్దరు యువకులు శ్రీనివాస్, విజయ్ లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాద సంఘటన తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలను ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. ఈ ఘటనపై రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్ షాహేద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ శనివారం తెలిపారు.

Next Story