- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ,కేశంపేట : మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని దత్తాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మామిడిపల్లి నరసింహ (35) గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసై తాగడానికి ఇతరుల వద్ద డబ్బులు తీసుకునే వాడు.
ఈ విషయంలో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈనెల 16వ తేదీన కూడా భార్యాభర్తలు గొడవపడి భార్య వాళ్ల చిన్నమ్మ ఊరైన గంగన్నగూడెం వెళ్లిపోయింది. దీంతో నరసింహ శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.
- Tags
- suicide
Next Story






