- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కూల్‌పై కూలిన ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం.. ఒకరు దుర్మరణం
ఎయిర్‌ఫోర్స్ (Airforce) శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన ఇవాళ మధ్యాహ్నం బంగ్లాదేశ్‌లోని నార్త్ ఢాకా (North Dhaka)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్‌ఫోర్స్ (Airforce) శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన ఇవాళ మధ్యాహ్నం 1.06కు బంగ్లాదేశ్‌లోని నార్త్ ఢాకా (North Dhaka)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్‌లో విద్యార్థులు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్‌క్రాఫ్ట్ ఎఫ్-7 బీజీఐ (F-7 BGI) వైమానిక దళానికి చెందినదని ధృవీకరించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఓ విద్యార్థి మరణించగా.. మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయని అగ్నిమాపక అధికారి లిమాఖాన్ తెలిపారు. మరో వైపు స్పాట్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రమాద దృశ్యాలు ఎక్స్‌క్లూజివ్‌గా ఇక్కడ... https://x.com/fptarun/status/1947218754582323336






