- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి ఉలిక్కిపడ్డ పాతబస్తీ.. అర్ధరాత్రి మరో హత్య
by Ajay Maddhiboyina |
పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం పాతబస్తీలో రియల్టర్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఇంటి అమ్మకం

X
దిశ, వెబ్ డెస్క్: పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం పాతబస్తీలో రియల్టర్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఇంటి అమ్మకం విషయంలో జరిగిన గొడవలో మాట్లాడేందుకు వచ్చి కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా ఈ ఘటన మరవకముందే మరోసారి పాతబస్తీ ఉలిక్కిపడింది. కామాటిపురలో అరవింద్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యువకుడికి తీవ్రగాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే యువకుడిని హత్య చేశాడరని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






