వందకు పైగా పోర్న్ వీడియోలు చూసిన పద్నాలుగేళ్ల బాలుడు.. సూసైడ్

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజిద్‌పూర్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు పోర్న్ వీడియోలు చూసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. యూట్యూబ్ హిస్టరీలో పూర్తిగా పోర్న్ కంటెంట్ ఉందని..

వందకు పైగా పోర్న్ వీడియోలు చూసిన పద్నాలుగేళ్ల బాలుడు.. సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజిద్‌పూర్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు పోర్న్ వీడియోలు చూసి.. ఆత్మహత్య చేసుకున్నాడు. యూట్యూబ్ హిస్టరీలో పూర్తిగా పోర్న్ కంటెంట్ ఉందని.. చనిపోయే ముందు దాదాపు 100కు పైగా వీడియోలు చూశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇత్వాహకు చెదిన కాంట్రాక్ట్ వర్కర్ అరవింద్‌ వాజిద్‌పూర్ వాటర్ బోర్డ్ గవర్నమెంట్ కాలనీలో నివసిస్తున్నాడు. ఆయన భార్య ఆరేళ్ల క్రితం చనిపోగా.. ఇద్దరు కూతుళ్లు రష్మి, రాణి, కొడుకును అపురూపంగా పెంచుకుంటున్నాడు. కానీ పిల్లలపై మానిటరింగ్ సరిగ్గా లేకపోవడంతో కొడుకు దారితప్పాడు పద్నాలుగేళ్ల పిల్లాడు పోర్న్‌కు బానిసైపోయాడు. ఆత్మహత్య చేసుకున్న రోజు రష్మి, రాణి ఆలయానికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లాడు వీడియోలు చూశాక సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story