- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లి మృత్యువాత
by Sridhar Babu |
కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బుధవారం హన్వాడ పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది.

X
దిశ, హన్వాడ : కాలకృత్యాలు తీర్చుకోడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన బుధవారం హన్వాడ పెద్ద చెరువు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిన్నదర్పల్లి గ్రామం నీల్యనాయక్ తండాకు చెందిన ముడావత్ రుక్మిణి (27) ఈనెల తన తల్లిగారి ఊరైన మహమ్మదాబాద్ మండలంలోని ముకర్లాబాద్ కు వెళ్లింది.
తిరిగి బుధవారం ఉదయం తన స్వగ్రామం చిన్నదర్పల్లి గ్రామం నీల్యనాయక్ తండాకు వచ్చే క్రమంలో హన్వాడకు వచ్చింది. హన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి చెరువులో మునిగిపోయింది. దీంతో ఊపిరాడక చెరువులోనే చనిపోయిందని ఎస్సై వెంకటేష్ తెలిపారు. మృతురాలికి భర్త, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. భర్త మోహన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
- Tags
- died
Next Story






