- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేపల వేటకు వెళ్లి మృత్యువాత
by Sridhar Babu |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, తిమ్మాజీపేట : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం తిమ్మాజీపేట గ్రామానికి చెందిన వట్టేపు శేఖర్ (47) శనివారం చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. శవాన్ని గమనించి అక్కడ ఉన్న కూలి పని చేస్తున్న మహిళలు గ్రామస్తులకు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై నరేందర్ రెడ్డి తోపాటు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని చెరువులో నుంచి శవాన్ని తీశారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు, భార్య ఉన్నారు.
- Tags
- person died
Next Story






