- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాది మొహిజుద్దీన్ హత్య.. అసలు సూత్రధారులెవరో తేల్చేశారు!
హైకోర్టు న్యాయవాది మొహిజుద్దీన్ దారుణ హత్య కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నగరం నడిబొడ్డున సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది మొహిజుద్దీన్ (Mohiuddin) దారుణ హత్య కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రూ.కోట్ల విలువైన వక్ఫ్ భూముల (Waqf Lands) వివాదమే ఈ దారుణ హత్యకు దారితీసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ కేసులో ముజాహిద్ ఆలంఖాన్, మొహబూబ్ ఆలంఖాన్‌లు సూత్రధారులుగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారు ఇరువురు న్యాయవాది మొహిజుద్దీన్‌ను మట్టుబెట్టేందుకు ఐదుగురు సభ్యుల ముఠాకు రూ.10 లక్షల సుపారీ (Contract Killing) ఇచ్చినట్లు విచారణలో తేలింది.
ఇక నిందితులు లాయర్ కదలికలపై పలుమార్లు రెక్కీ నిర్వహించి, పక్కా స్కెచ్‌తో ఆయన ఇంటి వద్దే కారుతో బలంగా ఢీకొట్టి ప్రాణాలు తీశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రధాన అనుమానితుడు వినయ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకుని అన్ని విషయాలపై విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం మిగతా నలుగురు నిందితులు గోవా (Goa)కు పారిపోయినట్లుగా పోలీసులు తేల్చారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వక్ఫ్ భూముల సెటిల్మెంట్లు, హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు అధికారికంగా ప్రకటించారు.






