- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఇద్దరు కల్తీకల్లు బాధితులు.. ఆస్పత్రికి తరలింపు
కల్తీకల్లు బాధితులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. హైదర్ నగర్ లో ఇప్పటికే 15 మంది వరకు బాధితులు

దిశ, శేరిలింగంపల్లి : కల్తీకల్లు బాధితులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. హైదర్ నగర్ లో ఇప్పటికే 15 మంది వరకు బాధితులు అస్వసస్థకు గురై రాందేవ్ రావు ఆస్పత్రిలో చేరగా వారిని మెరుగైన చికిత్స కోసం అక్కడికి నుండి నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా అల్వీన్ కాలనీ హెచ్ ఏంటీ హిల్స్ గంగమ్మ, బాలమణి అనే మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురైనట్టు గుర్తించారు. వారిని మెరుగైన చికిత్స కోసం రాందేవ్ రావు ఆస్పత్రికి తరలించారు. కల్తీ కల్లు మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
బాధితులు వీరే..
కల్తీ కల్లు ఘటనలో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మోహనప్ప, పెంటయ్య, యాదగిరి, రాములుకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే మాధవి, యోబు, నరసింహ, దేవదాస్, గోవిందమ్మా, లక్ష్మి, కోటేశ్వరరావు, పోచమ్మ, ప్రమీలకు సాధారణ వార్డులో చికిత్స కొనసాగుతుంది.






