- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
దుబాయ్ లో గుండెపోటుతో అడ్లూరు వాసి మృతి
by Shiva |
X
దిశ, కామారెడ్డి రూరల్ : బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పైనే ఆధారపడి జీవిస్తున్న భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లు భారం కన్నతల్లి పైనే పడింది. ఈ హృదయ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసాయిపేట రవి (43) అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం దుబాయ్ దేశానికి వెళ్లాడు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే సోమవారం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అతడితో సహచరులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అయితే, అతడి మృతదేహం గ్రామానికి రావడానికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని గ్రామస్థులు తెలిపారు.
Next Story