‘డబ్బులు సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదంటే కేసు పెడతా’.. అషురెడ్డి ఆడియో లీక్!

by Gantepaka Srikanth |

ప్రముఖ బిగ్‌బాస్ ఫేమ్, నటి అషురెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పెళ్లి పేరుతో తనను నమ్మించి సుమారు రూ. 9.35 కోట్లు కాజేసిందని లండన్‌లో ఉంటున్న ఎన్నారై ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

‘డబ్బులు సెటిల్ అయ్యాక ఇస్తా.. లేదంటే కేసు పెడతా’.. అషురెడ్డి ఆడియో లీక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బిగ్‌బాస్ ఫేమ్, నటి అషురెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పెళ్లి పేరుతో తనను నమ్మించి సుమారు రూ. 9.35 కోట్లు కాజేసిందని లండన్‌లో ఉంటున్న ఎన్నారై ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆడియో రికార్డింగ్ ఈ వివాదానికి మరిన్ని బలాన్ని చేకూరుస్తోంది.

వైరల్ ఆడియోలో ఏముందంటే..

"నేను తీసుకున్న డబ్బులో రూ. కోటిన్నర మే నెలలో ఇచ్చేస్తాను. మిగతాది నేను లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఇస్తాను. నటి ప్రవీణా, జ్యోతిష్యుడు వేణుస్వామి సమక్షంలో కూర్చుని ఈ విషయాన్ని పరిష్కరించుకుందాం. కుదరదు అని ఇలాగే మొండికేస్తే.. నా కుటుంబ సభ్యులను (అమ్మ, అక్క) ఈ వివాదంలోకి లాగితే, రివర్స్‌లో వేధింపుల కేసు పెడతాను" అని ధర్మేంద్రను అషురెడ్డి బెదిరించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

2018లో పరిచయమైన ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అషురెడ్డి తన అవసరాల కోసం భారీగా నగదు, 5 కిలోల బంగారం, విలాసవంతమైన కార్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయించిందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. 2020లో పెళ్లి ప్రస్తావన రాగా ఆమె నిరాకరించిందని, అప్పటి నుంచి డబ్బులు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను అషురెడ్డి తీవ్రంగా ఖండించారు. తన ప్రమేయం లేకుండా, తన అనుమతి లేకుండా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆడియో లీక్ కావడంతో అషురెడ్డి నిజంగానే డబ్బులు తీసుకుందనే విషయం స్పష్టమైందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, పోలీసులు ఈ ఆడియో ప్రామాణికతను నిర్ధారించాల్సి ఉంది. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఆడియో

Next Story