నటి ఆషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-05 16:39:26  IST  )

తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 ఫేమ్, నటి ఆషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

నటి ఆషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు బిగ్‌బాస్ సీజన్-3 ఫేమ్, నటి ఆషురెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు వ్యతిరేకంగా, పరువుకు భంగం కలిగించేలా ఉన్న వార్తలను, కథనాలను ప్రచురించడాన్ని తక్షణమే నిలిపివేయాలని సుమారు 30కి పైగా మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 20న నమోదైన ఒక ఎఫ్ఐఆర్‌తో ఆషురెడ్డి పేరును ముడిపెడుతూ పలు మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వరుస కథనాలు వచ్చాయి. ఇవి తనను అత్యంత ప్రతికూలంగా చిత్రీకరిస్తున్నాయని, తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని పేర్కొంటూ ఆషురెడ్డి పరువునష్టం దావా వేశారు. ఈ వ్యవహారంలో ఆయా మీడియా సంస్థలపై తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పి. శామ్ కోశీ ధర్మాసనం.. నటిపై వస్తున్న పరువునష్టం కలిగించే కంటెంట్‌ను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. కింది కోర్టులో ఉన్న ఆమె ఇంజంక్షన్ పిటిషన్‌పై ఆ న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Read more.... నందిత శ్వేత ‘బెన్ని’ అప్డేట్.. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫైరింగ్ పోస్టర్

Next Story