- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందిత శ్వేత ‘బెన్ని’ అప్డేట్.. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫైరింగ్ పోస్టర్
పోస్టర్, సినిమా ఏ స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.

దిశ, సినిమా: తెలుగులో 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' సినిమాతో వెండితెరకు పరిచయమై, తన సహజ సిద్ధమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నందిత శ్వేత. గ్లామర్ పాత్రల కంటే కూడా కథాబలమున్న పాత్రలకే ప్రాధాన్యతనిచ్చే ఈ చిన్నది, ఇప్పుడు ‘బెన్ని’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక కీలకమైన అప్‌డేట్‌ను పంచుకుంది. శ్రీలేష్ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని నందిత వెల్లడించింది. ఈ సందర్భంగా.. ఆమె షేర్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులు ఒక ఇంటిని తగలబెడుతున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్, సినిమా ఏ స్థాయిలో ఉత్కంఠభరితంగా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. సినిమా కథాంశం ఏదో ఒక సామాజిక ఇబ్బంది లేదా బలమైన ప్రతీకారేచ్ఛ చుట్టూ తిరుగుతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘బెన్ని’ చిత్రానికి అదనపు ఆకర్షణలు చాలానే ఉన్నాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమా గ్లింప్స్‌కు తన గాంభీర్యమైన వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఆయన గొంతు తోడవ్వడంతో సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ‘కేజీఎఫ్’ చిత్రంతో తన సంగీతంతో సంచలనం సృష్టించిన సచిన్ బస్రూర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సినిమాలకు ఎంత బలాన్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుదీప్ వాయిస్, సచిన్ మ్యూజిక్ కలిసి ‘బెన్ని’పై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఈ సినిమాను కేవలం ఒక్క భాషకే పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. నందిత శ్వేతకు సౌత్ ఇండియా అంతటా మంచి గుర్తింపు ఉండటంతో, ఈ బహుభాషా విడుదల ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు టాక్.






