- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెట్టింగ్ యాప్ కేసులో CID విచారణకు హాజరైన నటుడు రానా, విష్ణు ప్రియ.. ఆదాయంపై ఆరా!
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ సీఐడీ విచారణకు హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులులో టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్‌మెంట్ తీసుకున్న సీఐడీ.. ఇవాళ (శనివారం) సీఐడీ కార్యాలయంలో వీరి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాంకర్ విష్ణు ప్రియ మూడు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు అధికారుల సమాచారం. బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను విష్ణు ప్రియ CID సిట్ కి అందజేసినట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై సిట్ ఆరా తీసినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చిన ఆదాయంపై CID సిట్ విచారణ చేస్తోంది.
కాగా, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్‌కు చెందిన మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖీలపై కేసు నమోదు చేయగా నటుడు ప్రకాశ్ రాజ్ రెండు రోజుల క్రితం సిట్ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా బెట్టింగ్ యాప్స్ కేసుపై సిట్ విచారణ చేపట్టారు.






