- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ షాక్.. రూ. 35కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ ప్రముఖ నటుడు
డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన నటుడు.. చెన్నై విమానాశ్రయంలో 3.5 కిలోల కొకైన్‌తో దొరికిపోయాడు. దీని ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూ రూ.35 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన నటుడు.. చెన్నై విమానాశ్రయంలో 3.5 కిలోల కొకైన్‌తో దొరికిపోయాడు. దీని ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూ రూ.35 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. చెన్నై కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో డ్రగ్స్‌తో దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు. సింగపూర్ నుంచి వచ్చిన విమానంలో నటుడు చేస్తున్న కార్యకలాపాల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో అధికారుల అప్రమత్తమయ్యారు. చెక్ ఇన్ ట్రాలీ బ్యాగ్ స్కాన్ చేసి తనిఖీ చేయగా.. తెల్లటి పొడి పదార్థం దొరికింది. టెస్టులు చేస్తే కొకైన్ అని నిర్ధారణ అయింది. కాంబోడియాలో తెలియని వ్యక్తుల నుంచి ఈ బ్యాగ్ వచ్చిందని చెప్పినా.. ముంబై, ఢిల్లీ నుంచి రావచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇక సహాయ నటుడని తెలిపిన అధికారులు.. ఇంకా ఆయన పేరు బయటపెట్టకపోవడం విశేషం.






