Acid Attack: రాష్ట్రంలో సంచలన ఘటన.. యువతిపై యాసిడ్‌ అటాక్

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-04 08:37:04  IST  )

యువతిపై యాసిడ్‌‌తో దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State) విశాఖపట్నం (Vishakhapatnam)లో చోటుచేసుకుంది.

Acid Attack: రాష్ట్రంలో సంచలన ఘటన.. యువతిపై యాసిడ్‌ అటాక్
X

దిశ, వెబ్‌డెస్క్: యువతిపై యాసిడ్‌‌తో దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State) విశాఖపట్నం (Vishakhapatnam)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కయ్యపాలెం (Akkayapalem) పరిధిలోని శ్రీనివాస నగర్‌ (Srinivasa Nagar) ప్రాంతానికి చెందిన ఓ యువతి రోడ్డుపై నడుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యువతిపై పోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె శరీరం సగ భాగం పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు సదరు యువతిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Next Story