- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Acid Attack: హైదరాబాద్ నగరంలో దారుణం.. అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి
హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో దారుణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో దారుణం చోటుచేసుకుంది. అకౌంటెంట్ (Accountant)పై ఆగంతకుడు యాసిడ్ (Acid)తో దాడికి పాల్పడిన ఘటన సైదాబాద్ (Saidabad) భూలక్ష్మీ మాతా ఆలయం (Bhulakshmi Mata Temple)లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హోలీ (Holi) పండుగ సందర్భం ఆలయంలో విధుల్లో ఉన్న అకౌంటెంట్ వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. అనంతరం హ్యపీ హోలీ అని చెప్పిన ఆయన తల పైభాగంలో యాసిడ్ (Acid) పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఒంటిపై యాసిడ్ పడగానే నర్సింగ్ రావు విలవిలలాడిపోయాడు. నిందితుడు క్యాప్‌తో పాటు మాస్క్ పెట్టుకోవడంతో పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు.






