Meerpet Murder Case: నిందితుడు గురుమూర్తి అరెస్ట్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు

by Gantepaka Srikanth |

తెలంగాణలో దుమారం రేపిన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ హత్య కేసు(Meerpet Murder Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Meerpet Murder Case: నిందితుడు గురుమూర్తి అరెస్ట్.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో దుమారం రేపిన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ హత్య కేసు(Meerpet Murder Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు గురుమూర్తి(Accused Gurumurthy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. మంగళవారం నిందితుడు గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి విచారించారు. విచారణలో మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఉడికించానని తెలిపారు. ఇదిలా ఉండగా గతవారం రోజుల నుంచి గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. అనవసరంగా తనపై నిందలు వేస్తున్నారని.. తనకేం తెలియదని ఇన్నాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే హత్య జరిగిన ప్రాంతంలోని శాంపిల్స్‌తో గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి.

దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకెళ్లి సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్(Scene Reconstruction) చేశారు. దీంతో మాధవి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మాజీ సైనిక ఉద్యోగి, భర్త గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి బకెట్‌లో వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత సమీపంలోని చెరువులో విసిరేశారు. మాధవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించేందుకు చాలా కష్టపడ్డారు. నిందితుడు పోలీసులను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. తనకేం తెలియదని, తనకు సంబంధం లేదని దాటవేస్తూ వచ్చి.. చివరకు ఇవాళ తానే చేసినట్లు ఒప్పుకున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నిందితుడు గురుమూర్తిని పోలీసులు మీడియా ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు.

Next Story