Accused Arrested: హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు సచిన్ అరెస్ట్

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ (Himani Narwal) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Accused Arrested: హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు సచిన్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ (Himani Narwal) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హిమానీని అతి క్రూరంగా హత్య చేసిన నిందితుడు సచిన్‌ (Sachin)ను ఇవాళ ఉదయం హర్యానా పోలీసులు (Haryana Police) అరెస్ట్ చేశారు. రోహ్‌తక్‌లోని బస్టాండ్ సమీపంలో సూట్‌కేస్‌ (Suitcase)లో మృతదేహం ఉందనే సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అది కాంగ్రెస్ (Congress) కార్యకర్త హిమానీ నర్వాల్‌‌ది(Himani Narwal)గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తమ బిడ్డను అతి క్రూరంగా హతమార్చారని నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) కేసులో వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ మేరకు రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు హిమానీ కాల్ డేటా (Call Data) ఆధారంగా నిందితుడు ఆమె స్నేహితుడు సచిన్ అని నిర్ధారణకు వచ్చారు. హత్యకు ప్రధాన కారణం ఆర్ధిక లావాదేవీలేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిమాని తన స్నేహితురాలని, ఆమెను తనే చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. ఫిబ్రవరి 28న ఆమె కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడానికి ముందు, హిమానీని కలిశానని.. అనంతరం తమ ఇద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం జరిగిందని అన్నాడు. ఆవేశంలో ఆమె గొంతు కోసి హతమార్చానని.. అనంతరం డెడ్‌బాడీ (Dead Body)ని ఆమె సూట్‌కేసులోనే పెట్టి రోహ్‌తక్ బస్టాండ్ (Rohtak Bus Stand) సమీపంలో పడేశానని సచిన్ తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు.

Next Story