బాలికపై ఆటో డ్రైవర్ల అత్యాచారం.. కేసులో కీలక పరిణామం

by Gantepaka Srikanth |

బాలికపై ఆటో డ్రైవర్ల అత్యాచారం(Rape)లో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

బాలికపై ఆటో డ్రైవర్ల అత్యాచారం.. కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: బాలికపై ఆటో డ్రైవర్ల అత్యాచారం(Rape)లో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల కోసం బృందాలు ఏర్పడి గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తప్పించుకునేందుకు యత్నించిన నిందితుల కాళ్లకు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుల కాళ్లకు గాయాలు అయ్యాయి. అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే.. ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. ఒకరి కంటే ఎక్కువమంది బాలికపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోందన్నారు. చిన్నారి ముఖంపై బలమైన గాయాలైనట్లు వెల్లడించారు. ఆమె ప్రైవేటు భాగాల పైనా అనేక గాయాలు ఉన్నాయన్నారు. తాము చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటి అని వైద్యులు వెల్లడించడం హాట్ టాపిక్‌గా మారింది.

Next Story