- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు కారు దగ్ధం..
ప్రమాదవశాత్తు కారు దగ్ధం అయిన ఘటన గొల్లపల్లి మండలంలో జరిగింది.

X
దిశ, గొల్లపల్లి : ప్రమాదవశాత్తు కారు దగ్ధం అయిన ఘటన గొల్లపల్లి మండలంలో జరిగింది. పూర్తివివరాల్లోకి వెళ్తే పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాధ జీవన్ అనే వ్యక్తి తన కారు ని కిరాయికి ఇస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ క్రమంలో కారు కిరాయికి వెళ్లి వస్తుండగా గొల్లపల్లి మండలం రాఘవపట్నం శివారులోకి రాగానే కారు నుండి పొగలు రావడం ప్రారంభించాయి. అది గమనించిన జీవన్ కారు నుండి కిందకి దిగి ఏమి జరిగిందో అని చూసేలోపే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి కళ్ళ ముందే దగ్ధం అయిందని బాధితుడు వాపోతు తెలిపాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






