శబరిమల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు

by Naga Rani Yarlagadda |

శబరిమల నుంచి హైదరాబాద్ కు అయ్యప్ప భక్తులతో వస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది.

శబరిమల నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల నుంచి హైదరాబాద్ కు అయ్యప్ప భక్తులతో వస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం రాత్రి కడప జిల్లా సీకే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు, ఆరుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Next Story