Accident: కారును ఢీకొన్న పికప్ వ్యాన్.. ఏకంగా 15 మంది కూలీలు దుర్మరణం

by Kema Shiva Kumar |

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది కూలీలు మరణించారు.

Accident: కారును ఢీకొన్న పికప్ వ్యాన్.. ఏకంగా 15 మంది కూలీలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా 15 మంది దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ధార్ (Dhar) జిల్లాలో బుధవారం అర్ధరాత్రి దాటక చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న పికప్ వాహనం కారును ఢీకొట్టి అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలోనే వ్యాన్‌లో ఉన్న 15 మంది తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. అందులో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అనంతరం గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వారు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనం అతివేగంతో ఉండటం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో లోపల ఉన్న కూలీలు వాహనం కింద పడి నలిగిపోయారు.

కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav), ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story