- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో కారు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

దిశ, అచ్చంపేట : హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి ఘాట్ రోడ్డులో కారు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై ఈగలపెంట ఎస్సై ( బ్రహ్మగిరి ) జయన్న తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని భరత్ నగర్ కాలనీకి చెందిన 9 మంది ఒక కారులో శ్రీశైలం మల్లన్న దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు శ్రీశైలం జాతీయ రహదారి ( బ్రహ్మగిరి) దోమల పెంట గ్రామానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఆక్టోపస్ మలుపు వద్ద కారు ఓవర్ టెక్ చేస్తుండగా, దుర్గా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో జగదాంబ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. కారు నడుపుతున్న డ్రైవర్ రక్షిత్ అచ్చంపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారని.. మరికొందరికి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ప్రయాణికుల సహకారంతో..
ప్రమాదం జరిగిన వెంటనే శ్రీశైలం హైదరాబాద్ వెళుతున్న ఇతర ప్రయాణికులు అతికష్టం మీద కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108 ద్వారా ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.






