రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒక‌రు మృతి

by velandi.Saikiran |

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒక‌రు మృతి
X

దిశ, జవహర్నగర్ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... కౌకూర్ ప్రాంతంలో వరకాల స్వామి కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నెల 18న ఉదయం త‌న కుమార్తెను బస్టాండ్ వద్ద వదిలి ఇంటికి వస్తుండగా, వ్యతిరేక దిశలో వచ్చిన మరో ద్విచక్రవాహనదారుడు బలంగా స్వామిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేయగా... ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది స్వామి దవాఖానాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు స్వామి(67) అప్పటికే మరించాడని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ర& గా గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story