- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఆర్‌ఎస్‌ఐలు దుర్మరణం
కర్ణాటకలోని చల్లకెరె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆర్‌ఎస్‌ఐలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు హోం మంత్రి పరమేశ్వర ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురు ఆర్ఎస్‌ఐ (Reserve Sub Inspectors)లు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన కర్ణాటక రాష్ట్రంలో చిత్రదుర్గ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంజునాథ్ దారుమణి, అమరేష్, సచిన్, మహంతేష్ బొమ్మన్నవర్, ఈశ్వర్ ఐదగురు ఆర్ఎస్ఐలు హెగ్గెరె సమీపంలోని జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు చల్లకెరె తాలూకాలోకి చేరుకోగానే ఎదురుగా ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహంతేష్ బొమ్మన్నవర్, ఈశ్వర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసకున్న కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర (G Parameswara) ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విధి నిర్వహణలో ఉన్న యువ అధికారులు ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.






