- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండల పరిధిలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/యాచారం: ట్రావెల్స్ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి మాల్ సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన వాస సాయితేజ (22) మూసాపేట్‌కు చెందిన వాస పవన్ కుమార్(25) రాఘవేందర్ (25) మరో నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వెళ్లారు. తిరిగు ప్రయాణంలో హైదరాబాద్‌కు వస్తుండగా.. మాల్ సమీపంలోని మైసమ్మ దేవాలయం దాటి ఎస్సార్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకోగానే నాగార్జునసాగర్ వైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి కాను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. వాస శివకుమార్, వాస సాయికుమార్, ఎం.సందీప్, శివ కుమార్‌లకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వారిని చికిత్స కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






