- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా (Nandyal District)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఐదుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా (Nandyal District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొలెరో (Bolero) వాహనంలో కొంతమంది కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి బొలెరో (Bolero) ఆత్మకూరు (Athmakur) మండల పరిధిలోని బైర్లూటి (Bairluti) సమీపంలోకి రాగానే అతివేగంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పో్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రి (Athmakur Government Hospital)కి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమచారం ఇంకా తెలియాల్సి ఉంది.






