Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో 9 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున 2.30కి చోటుచేసుకుంది.

Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో 9 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున 2.30కి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహబువా (Jahabua) జిల్లాలోని మేఘ్‌నగర్ తెహసీల్‌లోని సంజేలి రైల్వే క్రాసింగ్ సమీపంలో సిమెంట్‌ లోడ్‌తో ఉన్న ట్రక్కు ఎదురుగా వస్తున్న వ్యాన్‌‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వ్యాన్‌లో ఉన్న మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న జహబువా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పద్మవిలోచన్ శుక్లా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Next Story