Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఎనిమిది మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-06 01:53:48  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ (Bihar) రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఎనిమిది మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన బిహార్ (Bihar) రాష్ట్రం కతిహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుపాల్ (Supal) ప్రాంతానికి చెందిన కొందరు వివాహా వేడకలకు హాజరై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే వారి కారు జాతీయ రహదారి 31పై పోతియా గ్రామం సమేలి బ్లాక్ ఆఫీసు వద్దకు రాగానే ఎదురుగా ఉన్న ట్రాక్టర్‌ (Tractor)ను బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లుగా కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ (SP Vaibhav Sharma) పేర్కొన్నారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) కోసం పంపామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story