- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని మధురై (Madhurai) జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధురై సమీపంలోని తిరుమంగళం (Thirumangalam) జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులంతా కన్యాకుమారి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, వారంతా కారులో మధురై వైపు వస్తుండగా తిరుమంగళం శివార్లలోని టోల్‌ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే తిరుమంగళం నియోజకవర్గ పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గ్యాస్ కట్టర్ల సహాయంతో అతికష్టం మీద వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మధురై ప్రభుత్వ ఆసుపత్రి (Madurai Government Hospital)కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






