Accident: అమీర్‌పేట్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. దంపతులకు తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ప్రయాణికులను కలవరపెడుతున్నాయి.

Accident: అమీర్‌పేట్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. దంపతులకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి అమీర్‌పేట్ (Ameerpet)-ఎస్ఆర్ నగర్ (SR Nagar) రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బైక్‌ను ఢీకొట్టిన వెంటనే ఆపకుండా వెళ్తున్న కారులో ఉన్న యువకులను స్థానికులు వెంబడించి పోలీసులకు అప్పగించారు. అయితే, వారు ఫుల్లుగా మద్యం సేవించి కారు నడుపుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.

Next Story