- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: కారు బీభత్సం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ దుర్మరణం
కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ కానిస్టేబుల్ (Constable) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District) గాంధారి (Gandhari)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ కానిస్టేబుల్ (Constable) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా (Kamareddy District) గాంధారి (Gandhari)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విధుల్లో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ బైక్ (Police Patrol Bike)ను ఎదురుగా అతివేగంతో వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కానిస్టేబుల్ రవి కుమార్ (Ravikumar) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More..
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు






