- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్/పెద్దశంకరంపేట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం వాసులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో శ్రీశైలం నుంచి తుల్జాపూర్ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దశంకర్‌పేట మండలం కొలపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి అతివేగంతో వస్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు నారాయణమ్మ (50), సురపమ్మ (60) స్పాట్‌లోనే ప్రాణాలో కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శంకర్, సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






