- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఏలూరు జిల్లా (Eluru District)లోని సోమవరప్పాడు (Somavarappadu) వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఏలూరు జిల్లా (Eluru District)లోని సోమవరప్పాడు (Somavarappadu) వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటరమణ ట్రావెల్స్ (Venkataramana Travels) బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ (Hyderabad) నుంచి కాకినాడ (Kakinada)కు బయలుదేరింది. అయితే, బస్సు ఏలూరు జిల్లా (Eluru District), సోమవరప్పాడు (Somavarappadu) వద్దకు చేరుకోగానే అతివేగంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ మేరకు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ఆసుపత్రి (Eluru District Hospital)కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.






