- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ACB : ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు
by Sridhar Babu |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు.

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. జైన్నూర్ మండ తహసీల్దార్ దూసిహెట్టి తిరుపతి, పోచ్చంలొద్ది గ్రామపంచాయతీ కార్యదర్శి శేఖర్ కలిసి కాంట్రాక్టర్ నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
బెండాగూడ సీసీ రోడ్డు పనులకు సంబంధించి రూ.9.10 లక్షల చెక్కు ఇవ్వడానికి తహసీల్దార్, కార్యదర్శి కలిసి కాంట్రాక్టర్ శుభోద్ నుంచి రూ.12 వేలు డిమాండ్ చేశారు. అతను ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.
Next Story






