మరోసారి పంజా విసిరిన ఏసీబీ.. మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-23 06:12:36  IST  )

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా దాడులు చేసి అక్రమార్కుల ఆటకట్టిస్తున్నా.. అక్రమార్జనకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

మరోసారి పంజా విసిరిన ఏసీబీ.. మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసంలో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా దాడులు చేసి అక్రమార్కుల ఆటకట్టిస్తున్నా.. అక్రమార్జనకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ మేరకు ఇవాళ తాజాగా ఏసీబీ (ACB) అధికారులు మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ (Kishan Nayak) నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవలే కేసు నమోదైంది. అయితే, కిషన్ నాయక్‌కు సుమారు రూ.100 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కిషన్ నాయక్ నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 12 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఇక కిషన్ నాయక్ రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ అధికార దుర్వినియోగం చేసి అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారనే ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story