HYD: దూకుడు పెంచిన ACB అధికారులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. నాంపల్లిలోని గగన్ విహార్‌(Gagan Vihar)లో మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు.

HYD: దూకుడు పెంచిన ACB అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో ఏసీబీ(ACB) అధికారులు దూకుడు పెంచారు. నాంపల్లిలోని గగన్ విహార్‌(Gagan Vihar)లో మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అధికారులకు పట్టుబడ్డారు. రూ.8 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అధికారులకు దొరికారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‎గా పని చేస్తోన్న సుధా ఓ కంపెనీకు సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడానికి వచ్చిన వ్యక్తిని రూ.8 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. గగన్ విహార్‎లో సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు.

Next Story