- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాంపల్లిలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ డిప్యూటీ టాక్స్ ఆఫీసర్ అరెస్ట్
by Bhanu |
రాష్ట్రంలో లంచాసురులపై ఏసీబీ క్రమం తప్పకుండా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం నాంపల్లి గగన్

X
దిశ, కార్వాన్: రాష్ట్రంలో లంచాసురులపై ఏసీబీ క్రమం తప్పకుండా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మంగళవారం నాంపల్లి గగన్ విహార్‌లో జరిగిన ఆపరేషన్‌లో మాదాపూర్ డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ సుధ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఓ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడంలో సహకరించాలంటే రూ.8,000 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు వ్యవహరించి, లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. లంచాలపై ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చినా, కొంతమంది అధికారులు పాత తీరు మానుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Next Story






