- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం జిల్లాలో ఏసీబీ రెయిడ్స్.. రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు
ఖమ్మం జిల్లా రవాణాశాఖ (RTA) కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా రవాణాశాఖ (RTA) కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక ఉద్యోగిని అరెస్టు చేసిన ఏసీబీ సిబ్బంది, పలు కీలక దస్తావేజులతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC)లు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో రవాణాశాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లు, దళారుల ద్వారా లంచాలు తీసుకోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. కార్యాలయంలో అనధికారిక వ్యక్తులు పనిచేస్తూ, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ జారీ వంటి పనులకు మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. అరెస్టైన వ్యక్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. స్వాధీనం చేసుకున్న దస్తావేజులు, RCలు, లైసెన్స్ కార్డుల ఆధారంగా మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా రవాణా శాఖలో అవినీతిపై దృష్టి సారించిన ఏసీబీ, తదుపరి చర్యలు తీసుకోనుంది.






