- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ACB ఎంట్రీ.. ఖంగుతిన్న పంచాయతీ కార్యదర్శి
by Gantepaka Srikanth |
న్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొగ్గు ఉత్పత్తి కోసం NOC జారీ చేయడానికి పెన్ పహాడ్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్(PS Satish Kumar) రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి తాము సిద్ధమని చెప్పిన బాధితులు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి పంచాయతీ ఆఫీస్‌కు వచ్చాడు. సరిగ్గా లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. సతీష్ కుమార్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
Next Story






