ఏసీబీ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

by Kema Shiva Kumar |

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

ఏసీబీ మెరుపు దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏసీబీ (ACB) అధికారులు మెరుపు దాడి చేశారు. లంచం డిమాండ్ చేసిన గుడిబండ (Gudibanda) తహసీల్దార్ కె.శ్రీధర్‌ (K Sridhar)ను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుడిబండ తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న కె.శ్రీధర్, ఎస్.రాయపురం గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి తన పని పూర్తి చేయడానికి రూ.20 వేల నగదును లంచంగా డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముందే పక్కా ట్రాప్ ఏర్పాటు చేసిన అధికారులు.. తహసీల్దార్ ఆ లంచం డబ్బు తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Next Story