- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లాపూర్‌లో విల్లా, కరీంనగర్‌లో మూడు ప్లాట్లు.. నూనె శ్రీధర్ అక్రమాస్తులు వందల కోట్లు
ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో నేడు ఏసీబీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో నేడు ఏసీబీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీధర్ నివాసంతో పాటు అతడి బంధువుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేశారు. కాగా సోదాలపై ఏసీబీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. భారీగా ఆస్తులు జప్తు చేసినట్టు ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది.
తెల్లాపూర్‌లో విల్ల, షేక్ పేటలో ప్లాట్, కరీంనగర్‌లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్ పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో మూడు ఇండిపెండెంట్ హౌస్‌లు ఉన్నాయని గుర్తించింది. వీటితో పాటూ 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. అంతే కాకుండా రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో భారీగా నగదు నిల్వ చేసినట్టు అధికారులు గుర్తించారు. శ్రీధర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో వందల కోట్లలో ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పదవిని అడ్డు పెట్టుకుని శ్రీధర్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. సోదాల అనంతరం శ్రీధర్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.






